46 మందితో కాంగ్రెస్ నాలుగో లిస్ట్ రిలీజ్

46 మందితో కాంగ్రెస్ నాలుగో లిస్ట్ రిలీజ్

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల కోసం 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్  పార్టీ తన నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది. మధ్యప్రదేశ్  మాజీ సీఎం దిగ్విజయ్  సింగ్, కార్తీ చిదంబరం, ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన దానిష్  అలీ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రాజ్ గఢ్  నుంచి దిగ్విజయ్  సింగ్  బరిలోకి దిగనున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నుంచి ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్  రాయ్  వరుసగా మూడోసారి పోటీచేస్తున్నారు. అమేథీ, రాయ్ బరేలీ స్థానాల్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించకుండా సస్పెన్స్ లో ఉంచింది. ప్రస్తుతం వయనాడ్  ఎంపీగా ఉన్న రాహుల్  గాంధీ.. అమేథీ నుంచి కూడా

పోటీచేసే అవకాశం ఉంది. ఈ రెండు సీట్లు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్నాయి. అయితే, గత లోక్ సభ ఎన్నికల్లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ.. కాంగ్రెస్  అభ్యర్థి రాహుల్  గాంధీపై విజయం సాధించారు. కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా రాయ్ బరేలీ నుంచి పోటీ చేయనున్నారు. ఈ సీటును కుమార్తె కోసం తల్లి సోనియా గాంధీ త్యాగం చేశారు.