నలభైమంది స్టార్ క్యాంపెయినర్లు.. లిస్ట్ విడుదల చేసిన కాంగ్రెస్

నలభైమంది స్టార్ క్యాంపెయినర్లు.. లిస్ట్ విడుదల చేసిన కాంగ్రెస్

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి ముఖ్య నాయకుల పేర్లు అందులో ఉన్నాయి. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి కేవీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ జాబితాలో ఉత్తరాఖాండ్ పార్టీ చీఫ్ కరణ్ మహారా, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, ఉత్తరాఖండ్ సీనియర్ నాయకులు హరీష్ సింగ్ ధామి, హరక్ సింగ్ రావత్ తదితరులు ఉన్నారు. 

వారితోపాటు సల్మాన్ ఖుర్షీద్, కుమారి సెల్జా, అల్కా లాంబా, గుర్దీప్ సింగ్ సప్పల్, విక్రమ్ సింగ్ నేగి, ప్రీతమ్ సింగ్, భువన్ చంద్ర కప్రి, డాక్టర్ జీత్ రామ్, దినేష్ అగర్వాల్ వంటి ఇతర సీనియర్ నాయకులను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు నియమించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ నేతలు ఉత్తరాఖండ్‌లో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు.