నోటీసులిచ్చి విచారణకు పిలవాల్సింది : కేటీఆర్

నోటీసులిచ్చి విచారణకు పిలవాల్సింది :  కేటీఆర్
  •     కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తున్నది: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులను చట్టవిరుద్ధంగా అరెస్ట్​ చేయడం దారుణమని బీఆర్ఎస్ ​వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తున్నదని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. జర్నలిస్టులను డీజీపీ నేరస్తుల్లా చూడడం దురదృష్టకరమని విమర్శించారు.  వారికి నోటీసులిచ్చి విచారణకు పిలవాల్సిందని, అర్ధరాత్రి ఇండ్లలోకి వెళ్లి అరెస్ట్ అంటే పోలీసులు అతి చేయడమేనన్నారు. జర్నలిస్టుల మీద పెట్టిన ఏ సెక్షన్లు కూడా నాన్-బెయిలబుల్ కావని చెప్పారు. 

మరి అలాంటప్పుడు   పోలీసులు అర్ధరాత్రి అరెస్టులతో జర్నలిస్టులను, వారి కుటుంబాలను ఎందుకు భయ భ్రాంతులకు గురిచేశారని నిలదీశారు. చట్టం ప్రకారమే డీజీపీ నడుచుకోవాలని, కాంగ్రెస్​ చేసే రాజకీయాల్లో భాగస్వాములు కావొద్దని కోరారు. ఈ అంశంలో రాహుల్​ గాంధీ వైఖరేంటని నిలదీశారు. మొహబ్బత్ కీ దుకాన్ తెలంగాణ శాఖ.. పౌరుల రాజ్యాంగ హక్కులను ఏ విధంగా కాలరాస్తుందో రాహుల్ గమనిస్తున్నారని అనుకుంటున్నానని కేటీఆర్ ఎద్దేవా చేశారు.