కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గింపుపై కాంగ్రెస్ సెటైర్లు

కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గింపుపై కాంగ్రెస్ సెటైర్లు

పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో.. రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి.  బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాయి.  దీంతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ప్రెజర్ పడుతోంది.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గిసున్నాయి. అస్సాం, గోవా, త్రిపుర, కర్ణాటక, గుజరాత్, మణిపూర్, ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై 7 రూపాయలు చొప్పున VAT తగ్గించాయి. హర్యానా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై 12 రూపాయల చొప్పున గగ్గినమాచనుంది. ఉత్తరాఖండ్ లో పెట్రోల్ పై రెండు రూపాయలు చొప్పున తగ్గించారు. అయితే డీజిల్ పై ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యాట్ 4 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. హిమాచల్ లో కూడా VAT తగ్గించామని.. దాంతో  కేంద్ర-రాష్ట్ర తగ్గింపులతో లీటర్ పెట్రోల్ పై 12 రూపాయలు, డీజిల్ పై 17 రూపాయలు తగ్గుతుందని ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ప్రకటించారు.
 
బీజేపీ.. దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ పన్నులు తగ్గిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న మిజోరంలో జోరంతంగ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లపై 7 రూపాయలు తగ్గించింది. సిక్కిం ప్రభుత్వం కూడా 7 రూపాయల చొప్పున తగ్గించింది. అరుణాచల్ ప్రదేశ్ లో పెట్రోల్ పై వ్యాట్ ను 20 శాతం నుంచి 14.5 శాతానికి, డీజిల్ పై 12.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్టు ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రకటించారు. ఇక బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న బిహార్ లో.. డీజిల్ పై 3 రూపాయల 90 పైసలు, పెట్రోల్ పై 3రూపాయల 20 పైసలు తగ్గిస్తున్నట్టు తెలిపారు సీఎం నితీశ్ కుమార్. రాష్ట్రపతి పాలనలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లోనూ పెట్రోల్, డీజిల్ లపై 7 రూపాయల చొప్పున తగ్గించారు.
 
1ఇక ఒడిశా సర్కార్ కూడా.. పెట్రో, డీజిల్ ధరలు తగ్గించింది. పెట్రోల్, డీజిల్ పై 3 రూపాయల చొప్పున వ్యాట్ తగ్గిస్తున్నట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. తగ్గించిన ధరలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయన్నారు. వ్యాట్ తగ్గింపుతో రాష్ట్రంపై 2వేల కోట్ల భారం పడుతుందన్నారు పట్నాయక్. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ మేరకు తాము కూడా VAT తగ్గిస్తున్నామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఇది ఆటోమాటిక్ గా జరుగుతుందన్నారు.  
 
ధరలు తగ్గింపుపై కాంగ్రెస్ సెటైర్లేసింది. మనస్పూర్తిగా కాకుండా, భయంతోనే తగ్గించారన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. జనాన్ని లూటీ చేస్తున్న సర్కార్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఈ మధ్య జరిగిన 3 లోక్ సభ, 30 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిజల్ట్స్ రానందునే.. ధరలు తగ్గించారని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం విమర్శించారు. దీనిపై వరుస ట్వీట్లు చేశారు చిదంబరం.