
- కామారెడ్డి ఎమ్మెల్యేను ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి, వెలుగు : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు శఠగోపం పెట్టిన కామారెడ్డి ఎమ్మెల్యేకు మళ్లీ స్థానిక ఎన్నికలొస్తుండడంతో ప్రజలు గుర్తుకొస్తున్నారని డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్రావు విమర్శించారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీటింగ్‌లో పీపీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 18 నెలలు గడిచినా కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదన్నారు.
సొంత ఫండ్స్ రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తానని గొప్పలు చెప్పి గాలికొదిలేశారన్నారు. సమావేశంలో లైబ్రరీ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, కామారెడ్డి టౌన్, రూరల్, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట మండలాల కాంగ్రెస్ప్రెసిడెంట్లు పండ్లరాజు, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, సుతారి రమేశ్, భీమ్ రెడ్డి, యాదవరెడ్డి, నాయకులు గొనే శ్రీనివాస్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పీసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులైన బద్దం ఇంద్రకరణ్‌రెడ్డిని నాయకులు సన్మానించారు.