నేతల కంటే.. హోర్డింగులే ఎక్కువ

నేతల కంటే.. హోర్డింగులే ఎక్కువ

తృణమూల్‌‌‌‌‌‌‌‌పై కాంగ్రెస్ స్టేట్ చీఫ్ విమర్శ 
న్యూఢిల్లీ: రానున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గిరీశ్ చోడంకర్ విమర్శలు చేశారు. గోవాలో టీఎంసీ నేతల కంటే, ఆ పార్టీ హోర్డింగ్సే ఎక్కువున్నాయని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన పీటీఐకి ఇంటర్య్వూ ఇచ్చారు. ‘‘టీఎంసీ హోర్డింగ్స్​లో కేవలం మమతా బెనర్జీ మాత్రమే కనిపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హోర్డింగ్స్​లో కేవలం అర్వింద్ కేజ్రీవాలే కనిపిస్తున్నారు. వాళ్లిద్దరూ వచ్చి, ఇక్కడేం చేస్తారు. గోవాను బెంగాల్ లేదా ఢిల్లీ వాళ్లు పాలించలేరు. గోవాను గోవా ప్రజలే పాలించుకుంటారు” అని చెప్పారు. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకే టీఎంసీ గోవాలోకి ఎంట్రీ ఇస్తోందని ఆరోపించారు.