ఖాళీ కుర్చీలను ఫొటో తీశాడని జర్నలిస్ట్ ను కొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు..

ఖాళీ కుర్చీలను ఫొటో తీశాడని జర్నలిస్ట్ ను కొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు..

ఎన్నికల ప్రచార సభలో ఖాళీగా ఉన్న కుర్చీలను ఫొటో తీసిన జర్నలిస్టుపై దాడి జరిగింది. శనివారం రాత్రి తమిళనాడులోని విరుదునగర్ లో కాంగ్రెస్ పార్టీ భహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో తమిళనాడు  కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అలిగిరి పాల్గొన్నారు. అయితే.. మీటింగ్ లో నాయకులు మట్లాడుతుండగా.. సభలో జనం లేరు. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. దీంతో సభలో ఉన్న ఫొటోజర్నలిస్ట్ ఖాళీ కుర్చీలను ఫొటో తీస్తుండగా.. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఖాళీ కుర్చీలను ఫొటో తీయవద్దంటూ జర్నలిస్ట్ పై దాడి చేశారు. దీంతో అతనికి గాయాలయ్యాయి. తోటి జర్నలిస్టులు అడ్డకోగా సాదారణ గాయాలతో బయటపడ్డాడు. దాడికి గురైన జర్నలిస్ట్ తమిళ్ వీక్లీ మ్యాగజైన్‌కు చెందిన  ఆర్‌ఎం ముత్తురాజ్‌గా గుర్తించారు.