అది పార్లమెంటా.. వాటర్ పార్కా..? మంత్రులు ఇక్కడే రీల్స్ చేసుకోవచ్చు: కాంగ్రెస్ సెటైర్

అది పార్లమెంటా.. వాటర్ పార్కా..? మంత్రులు ఇక్కడే రీల్స్ చేసుకోవచ్చు: కాంగ్రెస్ సెటైర్

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ బిల్డింగ్​లో వర్షపు నీరు లీక్ కావడంపై సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న విమర్శలు, సెటైర్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీజీ కొత్త పార్లమెంట్‌‌‌‌ను ఇండోర్ వాటర్ పార్క్‌‌‌‌గా మార్చేశారు.

దీనివల్ల మంత్రులు అరుణాచల్​ప్రదేశ్‌‌‌‌ వరకు వెళ్లి డబ్బు వృథా చేయకుండా.. స్విమ్మింగ్, డైవింగ్ చేసే రీల్స్‌‌‌‌ను ఇక్కడే షూట్ చేసుకోవచ్చు’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ పోస్ట్​చేసింది. అలాగే, ఇదే పోస్ట్‌‌‌‌లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును ఉద్దేశించి ‘ఇక్కడ దయచేసి ఓ  రీల్ చేయండి’ అంటూ అతన్ని ట్యాగ్ చేశారు.

పార్లమెంట్‌‌‌‌లో నీరు నిలవడాన్ని ఒక వాటర్ పార్క్‌‌‌‌తో పోలుస్తూ, అధికారికంగా ఎలాంటి ప్రయాణ ఖర్చులు లేకుండా అక్కడే ఈత కొట్టే రీల్స్ చేసుకోవచ్చంటూ ప్రతిపక్షాలు వ్యంగ్యంగా స్పందించాయి.