ఇయ్యాల దేశమంతటా ‘కిసాన్ విజయ్ దివస్’

ఇయ్యాల దేశమంతటా ‘కిసాన్ విజయ్ దివస్’
  • కాంగ్రెస్ పార్టీ నిర్ణయం

న్యూఢిల్లీ: అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన స్ఫూర్తిదాయక పోరాటానికి గుర్తుగా శనివారం దేశవ్యాప్తంగా ‘కిసాన్ విజయ్  దివస్’ను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన 700 మంది రైతుల కుటుంబాలను కూడా పార్టీ నేతలు పరామర్శించనున్నట్లు వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్ స్థాయిల్లో ర్యాలీలు, క్యాండిల్ మార్చ్ లు నిర్వహించాలని ఈ మేరకు పార్టీ స్టేట్ యూనిట్ల చీఫ్​లకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

అన్నదాతలు గెలిచిన్రు: సోనియా

అగ్రిచట్టాల రద్దు అన్నదాతలు సాధించిన విజయమని కాంగ్రెస్ చీఫ్ ​సోనియా గాంధీ అన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయమైనా సంబంధిత స్టేక్ హోల్డర్ లందరితో, అపొజిషన్ పార్టీలతో చర్చించిన తర్వాతే తీసుకోవాలి. దీనితో మోడీ ప్రభుత్వం పాఠం నేర్చుకుని ఉంటుం దని ఆశిస్తున్నాను” అని ఆమె పేర్కొ న్నారు. ‘‘రైతులు, కూలీలకు వ్యతిరే కంగా ప్రభుత్వంలోని వాళ్లు చేసిన కుట్ర ఓడిపోయింది. నియంతృత్వ పాలకుల అహంకారం కూడా నశించింది. ఇవ్వాళ అగ్రికల్చర్, ప్రజల బతుకుదెరువుపై దాడి చేయాలన్న కుట్రను ఓడించారు. అన్నదాతలు గెలిచారు” అని సోనియా హర్షం వ్యక్తం చేశారు.

అహంకారం తల దించింది

దేశంలోని రైతుల సత్యాగ్రహం ముందు అహంకారం తల దించిందని కాంగ్రెస్‌‌ ఎంపీ రాహుల్‌‌ గాంధీ అన్నారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని ‘‘అన్యాయంపై సాధించిన విజయం’’అని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు అభినందనలు చెబుతూ శుక్ర వారం ట్వీట్‌‌ చేశారు. జైహింద్‌‌.. జైహింద్‌‌ కా కిసాన్‌‌ అంటూ ట్విట్టర్‌‌‌‌లో పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ ఢిల్లీ బార్డర్లలో 2020 నవంబర్‌‌‌‌ నుంచి రైతులు ఆందోళన లు చేస్తున్నారు. కేంద్రంతో 11 సార్లు చర్చలు జరిపినా విజయవంతం కాలేదు.