- కాంగ్రెస్ ఆర్మూర్నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి
ఆర్మూర్, వెలుగు : మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పదేళ్ల అవినీతి, అక్రమాలకు బయటపెడ్తామని కాంగ్రెస్ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆర్మూర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై పీసీసీ ప్రెసిడెంట్మహేశ్కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పై మరోసారి నోరుజారితే జీవన్రెడ్డి కి తగిన బుద్ధి చెప్తామని వార్నింగ్ ఇచ్చారు. జీవన్మాల్బాధితులకు ఇవ్వాల్సిన లక్షల రూపాయలు ఇవ్వకుండా, బంగారు సాయిరెడ్డికి ఇవ్వాల్సిన కోట్ల రూపాయలు ఇవ్వకుండా జీవన్రెడ్డి మోసం చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ఇరిగేషన్భూమిలో వెంచర్ వేసి -, తన అనుచరులతో 200ల వెంచర్ లు వేయించి 30 వేల గజాల భూమిని అక్రమంగా జీవన్ రెడ్డి లాక్కున్న విషయం వాస్తవమే కదా అని అన్నారు. స్వార్థం కోసం జీవన్రెడ్డి అనేకసార్లు తన కాళ్లు మొక్కాడని ఆయన కోసం తాను రూ.150 కోట్లు నష్టపోయానని చెప్పారు. నమ్మి వచ్చిన వారిని మోసం చేయడమే జీవన్ రెడ్డి నైజమన్నారు. జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మధు తో పాటు మరొకరు ఇప్పటికి అక్రమ మొరం, ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్నారన్నారు. పదేండ్లలో ఆర్మూర్ నియోజకవర్గం ప్రజలను బెదిరింపులు, ఇబ్బందులకు గురిచేసి ఆరేడుగురిని చంపేశాడని ఆరోపించారు.
అందుకే జీవన్ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో థర్డ్ ప్లేస్‌కు పంపించానని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉండి సొంతంగా కోట్లు సంపాదించి , ఆర్మూర్ అభివృద్ధిని విస్మరించిన జీవన్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడని అన్నారు. తనపై కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు మానుకోవాలన్నారు. జీవన్ రెడ్డి బాధితులు తనను సంప్రదిస్తే సీఎం వద్దకు తీసుకెళ్లి తీసుకున్న డబ్బులను జీవన్ రెడ్డితో కక్కిస్తానన్నారు.
జీవన్ రెడ్డి ఒక పెద్ద దొంగ కాబట్టి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు వాస్తవాలు గ్రహించి పార్టీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ వాసు పార్టీ నాయకులు మాజిద్, పండిత్ పవన్, షేక్ మున్ను, కొంతం మురళి, భూపేందర్, చిట్టి రెడ్డి, శ్రావణ్, జిమ్మి రవి తదితరులు పాల్గొన్నారు.
