
అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ లో కాంగ్రెస్ గెలవబోతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించారు. షాద్ నగర్ సెగ్మెంట్ కేశంపేట మండలం కొండారెడ్డిపల్లికి చెందిన సీనియర్ నేతలు పల్లె ఆనంద్, పల్లె బాలేశ్వర్ సోదరులు, సర్పంచ్ పల్లె స్వాతి ఆధ్వర్యంలో గ్రామ ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారికి రేవంత్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పల్లె బ్రదర్స్ కాంగ్రెస్ లోకి రావడంతో కేశంపేట మండలంలో రాజకీయ సమీకరణ మారిందన్నారు. రాష్ట్రంలో బోణీ కొట్టబోయే మొదటి నియోజకవర్గం షాద్ నగర్ అని, వీర్లపల్లి శంకర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని పేర్కొన్నారు.