ప్రజల సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకే : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

ప్రజల సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకే : ఎమ్మెల్యే సంజీవరెడ్డి
  •     ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: ప్రజల సపోర్టు కాంగ్రెస్ పార్టీకే ఉందని పంచాయతీ ఎలక్షన్ లో రుజువైందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఖేడ్ నియోజకవర్గంలో 223 సర్పంచ్ స్థానాల్లో పోటీ జరగగా 167 సర్పంచులు కాంగ్రెస్ గెలుచుకుందన్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన సర్పంచ్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్  చేస్తుందని చెప్పారు.

 గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములై అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ రెబల్ వల్ల ఫలితాలు తారుమారయ్యాయన్నారు. ఎన్నికల జాప్యం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కొంత కుంటుపడ్డప్పటికీ నాయకులు గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం వల్లే కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ప్రెస్ మీట్ లో శంకర్, తాహెర్,  పండరి రెడ్డి, రాజు పాల్గొన్నారు.