హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్

హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలోని జిల్లాల్లో కేవలం 6 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్​ గెలిచింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ప్రభావం  చూపలేదు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగినప్పటికీ చాలాచోట్ల రెండో స్థానానికేపరిమితమైంది. ఒక్క వికారాబాద్ జిల్లాలోక్లీన్ స్వీప్ చేసింది. 4 సెగ్మెంట్లకు 2018లోఇక్కడ ఒకచోట మాత్రమే గెలిచింది. ఈసారి మొత్తం ఊడ్చేసింది.

రంగారెడ్డి జిల్లాలో 2 సీట్లలోనే విజయం సాధించింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు. చేవెళ్లలో మాత్రమే గట్టిపోటీ ఇచ్చింది. అయితే, ఇక్కడ స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్​ అభ్యర్థి గెలుపొందారు. నాంపల్లిలో కాంగ్రెస్​పై 4 వేల మెజారిటీతో ఎంఐఎం గెలిచింది. మిగతా చోట్ల ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. అన్నిచోట్ల వేలల్లో మెజార్టీతో వేరే పార్టీ అభ్యర్థులు గెలిచారు.