భద్రాద్రి కొత్తగూడెం : మణుగూరు బీఆర్ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ జెండా

భద్రాద్రి కొత్తగూడెం : మణుగూరు బీఆర్ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ జెండా

భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులో ఉద్రిక్తత నెలకొంది.  బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పార్టీ ఆఫీస్ ముందు ఫర్నిచర్స్, ఫ్లెక్సీలు  ద్వంసం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. తెలంగాణ భవన్ పై  బీఆర్ఎస్ జెండాలు పీకేసి ,కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు కార్యకర్తలు. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తమ కార్యాలయం ఆక్రమించి.. తెలంగాణ భవన్ గా మార్చాడని ఆరోపించారు. ఇవాళ్టితో తమ కార్యాలయం తమ హస్త గతమైందని ప్రకటించారు కాంగ్రెస్ శ్రేణులు. ఎమ్మెల్యే పాయం ,పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్  అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 ఈ విషయం తెలసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. మణుగూరు ఎమ్మెల్యే, సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.