గాంధీభవన్‌‌‌‌‌‌‌‌ ఎదుట అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

గాంధీభవన్‌‌‌‌‌‌‌‌ ఎదుట అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళన చేపట్టారు. అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పీసీసీ ఫిషరీస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మెట్టు సాయికుమార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ గత మూడేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే.. అమిత్ షా మాత్రం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ అంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని, . అమిత్ షా ఎన్నిసార్లు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చినా రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ఆదరించరని అన్నారు.