పర్వతగిరి, వెలుగు : దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ ఫ్లెక్సీకి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్‌రావు, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్, నాయకులు పాల్గొన్నారు.
