- మోదీ చేతిలో సీఈసీ జ్ఞానేశ్ కీలుబొమ్మ
- ఆయనను పదవి నుంచి తప్పించాలె
- ఈసీ స్వతంత్రతను కాలరాస్తున్న కేంద్రం
- సర్ పేరుతో ‘ఓట్ల డీమానిటైజేషన్’
- పేదలను ఓటు అనే లైన్ లోంచి గెంటేశారు
- నైతిక బాధ్యత వహిస్తూ మోదీ రిజైన్ చేయాలె
- సర్కార్ ముందు సీడబ్ల్యూసీ 5 డిమాండ్లు
- సింపుల్ ఫార్మాట్లో ఓటరు లిస్ట్ ఉండాలి
- అవకతవకలపై సమగ్ర విచారణ అవసరం
- సర్‌పై పూర్తి పారదర్శకత పాటించాలి
- సీడబ్ల్యూసీ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ, వెలుగు: ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్) ను తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఇప్పటివరకు ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన 13.30 కోట్ల మంది పేర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, అధికార బీజేపీ చేతుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు.
రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతను కేంద్రం కాలరాస్తోందని ఫైర్ అయ్యారు. ఎన్నికల సం ఘం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వివాదాన్ని గతంలో కేంద్రం చేసిన జరిగిన పెద్ద నోట్ల రద్దు తో పోల్చారు. ఇది ఒకరకంగా ఇది‘ఓట్ల డీమానిటైజేషన్’ అని పేర్కొన్నారు. ‘‘నోట్ల రద్దు సమయంలో పేదలు లైన్లలో నిలబడ్డారు.. ఇప్పుడు ఓట్ల డీమానిటైజేషన్ ద్వారా అసలు పేదలనే లైన్ల నుంచి బయటకు గెంటేశా రు’’అని మండిపడ్డారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలనలో ఓటు హక్కు కోసం కాంగ్రెస్ ఎలా పోరాడిందో.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సర్ విషయంలోనూ అదే స్థాయి చారిత్రక బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.
కాపాడాల్సిన వారే తొలగిస్తుండ్రు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లోని సమానత్వ హామీ, ఆర్టికల్ 326 లోని సార్వత్రిక వయోజన ఓటు- హక్కుకు విరుద్ధంగా ప్రజలపై ఓటరు అర్హత నిరూ పించుకునే భారాన్ని మోపడం సమస్యాత్మకమంగా మారిందని ఖర్గే అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గతంలో లేవనెత్తిన ఓటర్ల జాబితా అంశాలు ఇప్పుడు బలపడుతున్నాయన్నారు. ఓటర్ల హక్కులను కాపాడాల్సిన సంస్థలే వారి పేర్ల తొలగింపు నకు కారణమవుతున్నాయన్నారు. ఎన్నికల సంఘాన్ని బలహీనపరచడం తమ ఉద్దేశం కాదని, అధికార పక్షం- ప్రతిపక్షం రెండింటికీ సమాన విశ్వాసం కలిగేం త బలమైన, విశ్వసనీయమైన ఎన్నికల సంఘం కావా లన్నదే తమ డిమాండ్ అన్నారు. ఓటర్ల జాబితాలో ప్రతి కీలక మార్పుకు సంబంధించిన పూర్తి డేటాను బహిర్గతం చేయాలని, పేర్లు తొలగించిన ఓటర్లకు సమాచారం ఇచ్చి అప్పీల్ అవకాశం కల్పించాలని సమావేశం కాంగ్రెస్ 5 డిమాండ్లను ప్రకటించింది.
మోదీ ప్రభుత్వం చేతిలో జ్ఞానేశ్ కీలుబొమ్మ
మోదీ 12 ఏండ్ల పాలనలో ప్రజాస్వామ్య పునాదు లు, రాజ్యాంగబద్ధ సంస్థలను ధ్వంసం చేసిందని ఏఐసీసీ చీఫ్ ఖర్గే విమర్శించారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా నుంచి ప్రజల పేర్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మోదీ ప్రభుత్వానికి కీలుబొమ్మగా మారారని ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇప్పుడు పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి పౌరుడి ఓటు సురక్షితంగా ఉండాలని, ప్రతి ఓటును నిష్పక్షపాతంగా
లెక్కించాలని డిమాండ్ చేశారు. “మా పోరాటం ఏ పార్టీ, సంస్థ లేదా వ్యక్తికి వ్యతిరేకంగా కాదు.. ఓటర్ల హక్కులు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసమే” అని ఖర్గే వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడే చారిత్రక బాధ్యత మళ్లీ కాంగ్రెస్‌పై పడిందన్నారు.
సర్‌పై ఉమ్మడి వ్యూహం: కేసీ వేణుగోపాల్
సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యం ఎదుర్కొంటు-న్న అతిపెద్ద సమస్య ఓటు- చోరీ అని సమావేశం ఏకాభిప్రాయానికి వచ్చిందన్నారు. బుధవారం ఇండియా కూటమి నేతలు సమావేశమై తదుపరి కార్యాచరణ రూపొందిస్తారని వెల్లడించారు. సీడబ్ల్యూసీ నిర్ణయాలపై ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయా? లేదా? అనేది నేటి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కేసీ వెల్లడించారు. ఈ సమావేశానికి సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం సతీషన్‌తో పాటు తదితరులు హాజరయ్యారు.
ఎన్నికల ప్రక్రియపై 5 డిమాండ్లు
- ఓటర్ల జాబితాలో జరిగే ప్రతి పెద్ద మార్పుకు సంబంధించిన పూర్తి డేటాను బహిరంగపరచాలి.
- పేర్లు తొలగించిన ఓటర్లకు సమాచారం, అప్పీల్ అవకాశం కల్పించాలి.
- ఓటర్ల జాబితా, కీలక డేటాను రాజకీయ పార్టీలకు సకాలంలో ఉపయోగించగల రూపంలో అందించాలి.
- తీవ్రమైన అవకతవకలపై ఆధారాలు ఉంటే స్వతంత్ర, కాలపరిమితి విచారణ జరపాలి.
- ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన డేటా, నిర్ణయాల్లో పూర్తి పారదర్శకత ఉండాలి.
మేం పోతే మీరే వస్తరని..
కాంగ్రెస్ సాధిస్తుందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా భావిస్తున్నారని ఉన్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పేర్కొన్నారు. ‘‘మేం వెళ్లిపోయాక మీరే వస్తరు అని ఆ ఇద్దరూ నాతో చెప్పారు. వాళ్లకే ఆ నమ్మకం ఉన్నప్పుడు.. మీరు కూడా నన్ను నమ్మండి’’ అని మీటింగ్‌లో సీడబ్ల్యూసీ నేతలకు తెలిపినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. తనపై నేతలకు ఇప్పుడు పూర్తి నమ్మకం లేకపోవచ్చని, అయితే రాజకీయ పరిస్థితిపై తన అంచనాను నమ్మాలని, ఎన్నికల సంఘంపై చేస్తున్న పోరాటానికి అండగా ఉండాలని ఆయన కోరారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి దిగిపోవాల్సిందేనని, ఆయన రాజీనామా చేసినా ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఎస్ఐఆర్ను వెంటనే ఆపేయాలి, ప్రధాని, హోంమంత్రి బాధ్యత తీసుకోవాలని ప్రధాని మోదీ రాజీనామా చేయాలని రాహుల్ మూడు డిమాండ్లు చేశారు.
మోదీ, షా నాతో అన్నరు
సీడబ్ల్యూసీ సదస్సులో రాహుల్
ఒకే ఫ్రేమ్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు
సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్లో పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే , లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్నాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు డీకే శివ కుమార్, వీడీ సతీషన్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, దీపాదాస్ మున్షీ పార్టీ సీనియర్ నేతల గ్రూప్ ఫొటో
