కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికొదిలేశారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రాష్ట్రం వచ్చిన కొత్తలో కేసీఆర్ మస్తు మాటలు చెప్పిండు కానీ ఒక్కటి చేయలేదన్నారు. ఉమ్మడి ఏపీలో కట్టిన దవాఖానలే ఉన్నాయి తప్ప..కేసీఆర్ ఉద్ధరించిందేమి లేదని విమర్శించారు. సీఎం ఇచ్చిన హామీలనే గుర్తుచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు..అవి ఎక్కడ కట్టారో చెప్పాలన్నారు. 33 జిల్లాలకు 33 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హామీ ఏమైందని ప్రశ్నించారు.

ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నామన్నా జగ్గారెడ్డి..పీసీసీ స్థాయిలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి మండలానికి 30 బెడ్స్ హాస్పిటల్స్, 119 నియోజకవర్గాలకు 100 బెడ్స్ హాస్పిటల్స్ కు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారన్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.బీజేపీ నేతలు పబ్లిక్ హెల్త్ పై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.

పేదలకు అండగా ఉండే ఆరోగ్య శ్రీ ఎందుకు అమలుకావడం లేదన్నారు జగ్గారెడ్డి. బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్లే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పారు. ఇప్పుడైనా హరీష్ రావు ఆరోగ్య శ్రీ అమలు చేస్తాడా లేదా అని చెప్పాలన్ననారు. సర్కార్ హాస్పిటల్స్ లో వైద్యులు, ఇతర స్టాఫ్ కొరత తీవ్రంగా వేధిస్తోందని..దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఆరోగ్య శ్రీ పనిచేయక పేద ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి సర్వం కోల్పోతున్నారని తెలిపారు.