మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ వర్గాల కొట్లాట

మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ వర్గాల కొట్లాట

మనోహరాబాద్, వెలుగు: రెండో విడత  పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది.  పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారనే విషయంలో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి కొట్లాటకు దారితీసింది. ఒకరిపై ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వెళ్లి అందరిని అక్కడి నుంచి చెదరగొట్టారు.