రూ.5 కోట్లకు ఎమ్మెల్యే టికెట్

రూ.5 కోట్లకు ఎమ్మెల్యే టికెట్

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులపై కాంగ్రెస్​ పార్టీలో విభేధాలు భగ్గుమన్నాయి. ఈమధ్యే పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న అశోక్​ తన్వర్​ సొంత పార్టీపై సంచలన ఆరోపణలుచేశారు. టికెట్ల కేటాయింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, ఒక్కో ఎమ్మెల్యే టికెట్​ను రూ.5 కోట్లకు అమ్ముకున్నారంటూ కాంగ్రెస్​ చీఫ్​ సోనియా గాంధీ ఇంటి వద్ద బుధవారం మెరుపు ధర్నాకు దిగారు.

ఎడ్లుగా కష్టపడుతున్నవాళ్లను పక్కనబెట్టి, నిన్నకాక మొన్న పార్టీలో చేరినవాళ్లకు టికెట్లివ్వడం అన్యాయమని, కొత్తవాళ్లకు టికెట్లిస్తే ఎలా గెలుస్తామని ప్రశ్నించారు. 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీకి ఈనెల 21న ఎన్నికలు జరుగనున్నాయి.