హరితహారానికి ఉపాధి హామీ అనుసంధానం

హరితహారానికి ఉపాధి హామీ అనుసంధానం

హైదరాబాద్‌ : ల‌లాక్ డౌన్ కార‌ణంగా ప‌నిలేని పేద‌లకు ఉపాధిహామీ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌ట్నం వ‌దిలిన వ‌ల‌స కూలీలు ఉపాధిహామీ ప‌నిబాట ప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రం ప్ర‌భుత్వం వారికి చేతినిండా ప‌ని క‌ల్పంచే దిశ‌గా ఈ సారి హరితహారం కార్యక్రమాన్ని ఉపాధిహామీకి అనుసంధానం చేసింది. హరితహారం కార్యక్రమాన్ని జూలై రెండోవారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం 12,738 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచింది. జూన్ ‌నుంచే గుంతల తవ్వకం ప్రారంభించనుంది.

ఉపాధిహామీ పథకంలో కూలీలకు మెరుగైన ఉపాధి లభిస్తుందని.. వర్షాలు మొదలుకాగానే గుంతలు తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్టు చెప్పారు పంచాయతీరాజ్‌శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బీ సైదులు. ఈసారి గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఆ సంఖ్య ఇప్పటికే 25 లక్షలు దాటిందని తెలిపారు. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్ ‌ను అందజేయడం హరితహారానికి ఎంతో మేలు చేస్తుంద‌ని.. సర్పంచ్ ‌లు ట్రాక్టర్ ‌ను ట్యాంకర్ ‌గా వాడి మొక్కలకు నీళ్లు పోస్తున్నారని తెలిపారు పంచాయతీరాజ్‌శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బీ సైదులు.