ఇండియా తిరిగి వెళ్లిపోండి : 30 ఏళ్ల తర్వాత జపాన్ దేశం ఎందుకు ఆదేశించింది..!

ఇండియా తిరిగి వెళ్లిపోండి : 30 ఏళ్ల తర్వాత జపాన్ దేశం ఎందుకు ఆదేశించింది..!

జపాన్‌లో 18 ఏళ్లుగా ఇండియన్ రెస్టారెంట్ నడుపుతున్న ఒక భారతీయుడికి.. అక్కడి అధికారులు బిజినెస్ మేనేజర్ వీసా పొడిగింపు తిరస్కరించడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దింతో తన రెస్టారెంట్‌ను కూడా మూసేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జపాన్‌లోని సైతామా ప్రాంతంలో రెస్టారెంట్ నడుపుతున్న మనీష్ కుమార్ అనే భారతీయుడు.. అక్కడి కఠినమైన ఇమ్మిగ్రేషన్ రూల్స్  వల్ల జపాన్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ (ISA) తన వీసా అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసిందని చెప్పారు.

టోక్యోలో జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో మనీష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయంతో తాను పూర్తిగా కుంగిపోయానని, జపాన్‌లో తన కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడుతున్నానని వాపోయారు. రెండు వారాల క్రితం నన్ను నా సొంత దేశానికి వెళ్ళిపోమని అధికారులు చెప్పారు. నా పిల్లలు జపాన్‌లోనే పుట్టి పెరిగారు. వారికి జపనీస్ భాష మాత్రమే వచ్చు. వారి స్నేహితులు కూడా జపనీస్ వాళ్లే. అయినా సరే మమ్మల్ని ఇండియా వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి ?.. అని ఆయన ప్రశ్నించారు.

చిన్న వ్యాపారాల పరిస్థితి 
గత ఏడాది జపాన్ ప్రభుత్వం  బిజినెస్ మేనేజర్ వీసా రూల్స్‌లో పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఆ తర్వాత చిన్న విదేశీ వ్యాపారాలు నడుపుకునే వారిలో పెరిగిన ఆందోళనకు మనీష్ కుమార్ ఉదంతమే ఒక ఉదాహరణ. అధికారిక లెక్కల ప్రకారం.. 2025 అక్టోబర్‌లో ఈ కొత్త నిబంధనలు వచ్చినప్పటి నుంచి వీసా దరఖాస్తులు ఏకంగా 96 శాతం తగ్గిపోయాయి. అంతకుముందు నెలకు సుమారు 1,700 అప్లికేషన్లు వచ్చేవి, ఇప్పుడవి కేవలం 70కి పడిపోయాయి.

నిజంగా వ్యాపారాలు చేయకుండా, జపాన్‌లో ఎక్కువ కాలం ఉండటానికి వీసాను ఒక అడ్డదారిగా వాడుకునే వారిని అడ్డుకోవడానికే ఈ కఠినమైన రూల్స్ తెచ్చామని జపాన్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ కఠిన నిర్ణయాల వల్ల నిజాయితీగా చిన్న వ్యాపారాలు చేసుకునే వారు నష్టపోతున్నారని విమర్శకులు అంటున్నారు.

 కొత్త రూల్స్ ఇవే:
'జపాన్ టైమ్స్' సాండ్  'KPMG' ప్రకారం.. విదేశీ వ్యాపారవేత్తల కోసం జపాన్ పెట్టిన కఠినమైన రూల్స్... 
*గతంలో వ్యాపారం ప్రారంభించడానికి కనీస పెట్టుబడి సుమారు రూ. 30 లక్షలు ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు దాన్ని ఏకంగా 30  సుమారు రూ. 2 కోట్లకు పెంచారు.  
* దరఖాస్తుదారులు ఇప్పుడు కనీసం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది  జపాన్ ఉద్యోగులను ఫుల్ టైం పనిలో పెట్టుకోవాలి. గతంలో పెట్టుబడి ఉంటే  జపాన్ ఉద్యోగులను పెట్టుకోవడం  ఆప్షనల్ గా ఉండేది.
*వ్యాపారం చేసే వారికి లేదా పని చేసే ఫుల్ టైం ఉద్యోగులకు జపనీస్ భాషా పరీక్షలో కనీసం JLPT N2 లెవెల్  సామర్థ్యం ఉండాలని అధికారులు కోరుతున్నారు.
*విదేశీ దరఖాస్తుదారులకు ఖచ్చితంగా వ్యాపార నిర్వహణ (మేనేజ్‌మెంట్) అనుభవం కానీ, దానికి సంబంధించిన చదువు కానీ ఉండాలి.
*వ్యాపార ప్రణాళికలను  ఇప్పుడు ప్రొఫెషనల్స్‌తో వెరిఫై చేయించాల్సి ఉంటుంది. అలాగే ట్యాక్స్ రికార్డులు, ఆఫీస్ అడ్రస్‌లను అధికారులు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు.  
*సిస్టమ్ దుర్వినియోగం కాకుండా ఉండటానికే ఈ మార్పులు చేశామని జపాన్ ప్రభుత్వం చెబుతున్న.. ఈ చర్యలు జపాన్‌లో ఎన్నో ఏళ్లుగా నమ్ముకుని బతుకుతున్న చిన్న వ్యాపారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.