కేసీఆర్ హయాంలో.. పేరుకుపోయిన ఫైళ్లను పరిష్కరిస్తున్నం : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ హయాంలో.. పేరుకుపోయిన ఫైళ్లను పరిష్కరిస్తున్నం : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్​లో చేరికలకు గేట్లు ఓపెన్​ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్​సభ ఎన్నికల కోడ్​ వచ్చిందని, ఇక నుంచి తాను పీసీసీ ప్రెసిడెంట్​గా తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు. ‘‘కాంగ్రెస్‌‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్​ఎస్, బీజేపీ నేతలు పదేపదే అంటున్నరు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడ్తామంటే చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు.  

కొద్దిమంది అధికారుల చేతుల్లోనే అధికారాన్ని పూర్తిగా పెట్టిన విధానానికి స్వస్తి పలికామని సీఎం రేవంత్​ తెలిపారు.  ప్రతిశాఖకు సమర్థవంతమైన అధికారులను నియమించి, స్వేచ్ఛగా వాళ్లు నిర్ణయాలు తీసుకునేలా పరిపాలనను వికేంద్రీకరించామన్నారు. పదేండ్లుగా పేరుకుపోయిన వేలాది ఫైళ్లను పరిష్కరించుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామన్నారు.6 గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు.  

గత సర్కార్​ తీరుతోనే నీళ్ల సమస్య

నిరుడు వర్షాలు పడలేదని,  రిజర్వాయర్లలో ఉండాల్సిన నీటిని గత సర్కార్​ నిర్లక్ష్యంతో మెయింటెయిన్​ చేయలేదని సీఎం రేవంత్​ మండిపడ్డారు. నీళ్లను పక్క రాష్ట్రం తరలించుకుపోతుంటే కూడా గత కేసీఆర్​ సర్కార్​ నియంత్రించే పనిచేయలేదని అన్నారు. అయినా చిన్న సమస్య కూడా రాకుండా ముందుకు పోతున్నామని తెలిపారు.

ALSO READ | కుట్రలు తిప్పి కొడ్తం : సీఎం రేవంత్ రెడ్డి

 తాగునీటిపై కర్నాటక ప్రభుత్వ అధికారులతో మన  ఆఫీసర్లు మాట్లాడుతున్నారని వివరించారు. విద్యుత్​ విషయంలో కొందరు వారి ఏరియాల్లో లైన్​మన్లకు ఫోన్లు చేసి వీఐపీ మీటింగ్స్​లో కావాలని కరెంట్​ కట్​ చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని, అట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.