రాహుల్ను బదనాం చేసే కుట్ర.. 'ఎట్ హోమ్'లో బీజేపీ నేతలే గమోసా ధరించలేదు: ఖర్గే

రాహుల్ను బదనాం చేసే కుట్ర.. 'ఎట్ హోమ్'లో బీజేపీ నేతలే గమోసా ధరించలేదు: ఖర్గే

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీని బదనాం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాష్ట్రపతి 'ఎట్ హోమ్' ప్రోగ్రామ్​లో అస్సామీ సాంప్రదాయ గమోసా(స్కార్ఫ్) విషయంలో రాహుల్​పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

"రాష్ట్రపతి ఎట్ హోమ్ ప్రోగ్రామ్​లో  రాహుల్ గాంధీ గమోసా ధరించకుండా ఈశాన్య రాష్ట్రాలను, వాటి సంస్కృతిని అవమానించారని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నది. నిజానికి రాహుల్ గమోసా ధరించారు. తర్వాత చేతిలో పట్టుకున్నారు. నేనూ, రాహుల్ తినేటప్పుడు గమోసాను టేబుల్​పై పెట్టాం. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్​ గమోసా ధరించలేదు. బీజేపీ నేతలే ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని అవమానించారు. రాహుల్ మాత్రమే ఈశాన్య కళాకారులందరినీ ఆత్మీయంగా కలిశారు" అని ఖర్గే పేర్కొన్నారు.