కానిస్టేబుల్ అభ్యర్థుల అరెస్ట్ల పర్వం.. జీఓ 46 రద్దు చేయాలని డిమాండ్

కానిస్టేబుల్ అభ్యర్థుల అరెస్ట్ల  పర్వం.. జీఓ 46 రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలో కానిస్టేబుల్ అభ్యర్థుల అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. ఛలో ప్రగతిభవన్ పిలుపుతో ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 200 మంది పోలీసులతో మెట్రో రైల్వేస్టేషన్, బస్టాండ్, ఫ్లై ఓవర్లు, షాపింగ్ మాల్స్ వద్ద సివిల్ డ్రెస్ లలో ఉండి అరెస్ట్ చేశారు పోలీసులు. సిటీ మొత్తం 200మందికి పైగా కానిస్టేబుల్ అభ్యర్థుల అరెస్ట్ అయ్యారు. మొబైల్ చెక్ చేసి.. జీఓ 46కు వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా మెసేజ్ ఉంటే చాలు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. 

తమను టెర్రరిస్టులు, నక్సలైట్స్ మాదిరిగా పోలీసులు వ్యవహరిస్తూ అరెస్ట్ చేస్తున్నారని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 130మార్కులు సాధించిన మెరిట్ స్టూడెంట్స్ కూడా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీఓ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాల్లో ఉండే ఎమ్మెల్యేలు తమకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. సీఎం కేసీఆర్ కు హైదారాబాద్ పై ఉన్న ప్రేమ జిల్లాలపై లేదని, ఒక హైదారాబాద్ ఓట్లతోనే సీఎం అయ్యారా..? అని ప్రశ్నించారు.