కొండగట్టు హనుమాన్ జయంతి వేడుకల్లో అస్వస్థతకు గురైన వృద్ధురాలు.. మానవత్వం చాటుకున్న మహిళా కానిస్టేబుల్..

కొండగట్టు హనుమాన్ జయంతి వేడుకల్లో అస్వస్థతకు గురైన వృద్ధురాలు.. మానవత్వం చాటుకున్న మహిళా కానిస్టేబుల్..

నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమయ్యే ఉద్యోగాల్లో పోలీస్ ఉద్యోగం ఒకటి.. పోలీస్ ఉద్యోగం అనడం కంటే.. బాధ్యత, కర్తవ్యం అనడం కరెక్ట్ అని చెప్పచ్చు. అన్ని చోట్ల ఉన్నట్లే పోలీస్ వ్యవస్థలో నీచులు ఉన్నారు కానీ.. అప్పుడప్పుడు పోలీసుల్లో మానవత్వం ఇంకా చచ్చిపోలేదని అనడానికి నిదర్శనంగా కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. మే 22న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.. హనుమాన్ జయంతి సందర్భంగా దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు క్యూ లైన్లో అస్వస్థతకు గురయ్యింది.

ALSO READ | వేసవి సెలవులు..కిక్కిరిన నెహ్రూ జూపార్క్

క్యూ లైన్లో అస్వస్థతకు గురైన వృద్ధురాలిని అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ స్వరూప గమనించింది.. వెంటనే అప్రమత్తమైన స్వరూప వృద్ధురాలిని సుమారు 100 మీటర్లు మోసుకెళ్లి 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించింది. సకాలంలో చికిత్స అందించడంతో వృద్ధురాలు కోలుకుంది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో శెభాష్ స్వరూప అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.