
హుజూర్ నగర్, వెలుగు: సమయానికి కానిస్టేబుల్ స్పందించడంతో రైతుకు ప్రాణాపాయం తప్పింది. గురువారం హుజూర్ నగర్‌లోని గోవిందపురం పీఎసీఎస్ వద్ద రైతు కుడి తొట్టి స్వామి యూరియా కోసం క్యూ లైన్‌లో నిలబడి ఉండగా హార్ట్ స్ట్రోక్ రావడంతో కింద పడిపోయాడు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డాడు.
అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ నరేశ్ వెంటనే అప్రమత్తమై రైతుకు సీపీఆఆర్ చేసి ప్రథమ చికిత్స అందించాడు. ఊపిరి అందుకున్న రైతును స్వామిని108 ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేశారు. సీపీఆర్ ద్వారా సమయస్ఫూర్తితో రైతుకు ప్రాణాపాయం తప్పించిన కానిస్టేబుల్ నరేశ్‌ను పలువురు అభినందించారు.