రేపట్నుంచి కానిస్టేబుల్ పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్

రేపట్నుంచి కానిస్టేబుల్ పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్
  • ఏ4 సైజులో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి
  • కానిస్టేబుల్ రాత పరీక్షకు ఒక్క సెకండ్ లేటైనా నో ఛాన్స్
  • ఈనెల 28న కానిస్టేబుల్ రాత పరీక్ష

హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్లు రెడీ అయ్యాయి. రేపట్నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. ఈనెల ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇది వరకే ప్రకటించింది. 
రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను రేపటి నుంచి ఆగస్టు 26 వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. మొత్తం 16 వేల 321 పోస్టులకు  సంబంధించి 6 లక్షల 61వేల 196 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. 1601 సెంటర్లలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. ఏ4 సైజులో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. సెకండ్ లేటొచ్చినా ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించమని అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రంలోకి.. అలాగే పరీక్ష నిర్వహించే గదిలోకి ఎలాంటి గ్యాడ్జెట్ వస్తువులు అనుమతి ఉండదని.. అభ్యర్ధులందరూ నలుపు లేదా నీలి రంగు బాల్ పాయింట్ పెన్నులు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.