ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ వచ్చింది: గవర్నర్ తమిళిసై 

ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ వచ్చింది: గవర్నర్ తమిళిసై 

హైదరాబాద్: రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తోనే తెలంగాణ కల సాకారమైందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇతర దేశాలకు మన రాజ్యాంగం స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. రాజ్ భవన్ లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.

వేడుకల సందర్భంగా మాట్లాడిన గవర్నర్ తమిళిసై మన దేశంలో రాజ్యాంగమే సుప్రీం అని వివరించారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలను పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన తమ  హక్కులను పొందుతూ.. కాపాడుకుంటూ.. విధులను పాటించాలని గవర్నర్ తమిళిసై కోరారు.