హైదరాబాద్, వెలుగు: వెనెజువెలాపై అమెరికా అక్రమంగా దాడి చేయడం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అరెస్ట్ చేయడాన్ని రాజ్యాంగ పరిరక్షణ వేదిక తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి వేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వేదిక నాయకులు మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాద చర్యలు ప్రపంచ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారాయన్నారు. ఒక దేశ అధ్యక్షుడిని అక్రమంగా నిర్బంధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్నారు.
