రాజ్యాంగాన్ని స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో పెట్టాలి

రాజ్యాంగాన్ని స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో పెట్టాలి
  • రాజ్యాంగాన్ని స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో పెట్టాలి
  • ధర్మ సమాజ్​ పార్టీ అధ్యక్షుడు విశారదన్​ డిమాండ్
  • రేపు ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్నట్లు వెల్లడి


ఖైరతాబాద్, వెలుగు: ప్రాథమిక స్థాయి నుంచి భారత రాజ్యాంగాన్ని బోధించాలని ధర్మ సమాజ్  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్  సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పౌరులకు ఏ హక్కులు, విధులు ఉన్నాయో రాజ్యాంగం తెలుపుతుంది. సమాజంలో ఎలా బతకాలి, దేశాన్ని ఎలా నడిపించాలో  వివరిస్తుంది. రాజ్యాంగ విలువలను ప్రభుత్వాలు పౌరులకు తెలియజేయకపోవడం వల్లే దేశంలోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పడుతున్నాయి. ప్రతిఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి”  అని విశారదన్  పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని కోరుతూ 40 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు ధర్నాలు కూడా నిర్వహించామని ఆయన తెలిపారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, దీంతో ఈ నెల 12న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపడుతున్నామని విశారదన్ మహరాజ్ వెల్లడించారు.