
EPF ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్..ఉద్యోగులు తమ సంపాదనలో కొంత భాగాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లో దాచుకున్న మొత్తం.EPFO ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ.ఉద్యోగులు తమ పొదుపులో కొంత భాగాన్ని వివాహం, ఉన్నత విద్య, ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం లేదా వైద్య అనారోగ్యం,నిరుద్యోగం వంటి సందర్భాల్లో పీఎఫ్ విత్ డ్రాకు అనుమతిస్తుంది.అయితే పొదుపు చేసిన మొత్తంలో ఎంత విత్ డ్రా చేసుకోవచ్చని చాలామంది లో డౌట్ ఉంటుంది. PF విత్ డ్రాలో ఉన్న సందేహాలను ఆర్టికల్ ద్వారా పరిష్కార మార్గాలు తెలుసుకుందాం.
ప్రావిడెండ్ ఫండ్ (PF) ను మూడు రకాలుగా విత్ డ్రా చేసుకోవచ్చు.
-
రిటైర్డ్ అయినతర్వాత పూర్తి PF విత్ డ్రా
-
మధ్యలో పాక్షికంగా PF విత్ డ్రా
-
పెన్షన్ రూపంలో ప్రయోజనం
PF ఏ సందర్బాల్లో విత్ డ్రా చేసుకోవచ్చంటే..
నిరుద్యోగం, పిల్లల చదువు, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం, చివరగా ఉద్యోగ విరమణ చేసినప్పుడు PFను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే వీటిలో పొదుపు చేసిన పూర్తి మొత్తాన్ని కేవలం రిటైర్డ్ అయినప్పుడు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా సందర్భాల్లో పొదుపులో కొంత మొత్తం మాత్రమే విత్ డ్రాకు అవకాశం ఉంటుంది.
ఎంత మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు?
1. నిరుద్యోగిగా ఉన్నప్పుడు
ఒక ఉద్యోగి లేదా కార్మికుడు తను ఉద్యోగం మానేసి నెలపాటు ఉద్యోగం మానేసి ఉంటే పొదుపు మొత్తంలో 75 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. రెండు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే మొత్తం బ్యాలెన్స్ను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
2. పిల్లల చదువుల కోసం..
పదవ తరగతి తర్వాత తమ పిల్లల విద్య ఖర్చులకోసం లేదా వారి ఉన్నత విద్యకోసం ఉద్యోగి ఈపీఎఫ్ కు చెల్లించిన పొదుపు మొత్తంలో 50శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
3.ఇంటి పునరుద్దరణకు..
ఉద్యోగి తన ఇంటి పునరుద్దరణ(మరమ్మతులు) సమయంలో EPF విత్ డ్రాకు అవకాశం ఉంది. ఇల్లు కట్టి కనీసం ఐదేళ్లకు పైనే అయివుంటే ఇంటి పునరుద్దరణకు పేరా 68B(7) కింద గృహ మెరుగుదలకు ఉద్యోగులు/కార్మికులు PF ఖాతానుంచి అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఐదేళ్ల లోపు ఉండే ట్యాక్సులకు లోబడి PF విత్ డ్రా చేసుకోవచ్చు. రూ. 50వేలకంటే TDS ఉండదు.
4. పిల్లల పెళ్లి..
PF ఖాతాదారులు వారి పిల్లల పెళ్లి లేదా ఖాతాదారుడే పెళ్లి చేసుకునే సమయంలో కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. మొత్తం పొదుపులో 50శాతం వరకు డ్రా చేసుకోవచ్చు.
5.ఉద్యోగాలు మారినప్పుడు ..
ఉద్యోగాలు మారేటప్పుడు ఉద్యోగి/కార్మికుడు తన పొదుపును విత్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. UAN నంబర్ యాక్టివ్ గా ఉండి , సంబంధిత ఫారమ్ లను సబ్మిట్ చేయడం ద్వారా డబ్బును బదిలీ చేసుకోవచ్చు.
6.పదవీ విరమణ:
ఇక చివరగా పదవీ విరమణ సమయంలో PF మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. EPF చట్టం ప్రకారం.. 58యేళ్లకు పదవీవిరమణ చేస్తారు. ఆ టైంలో తుది సెటిల్ మెంట్ క్లెయిమ్ చేసుకోవాలి. ఖాతాదారులు/ఉద్యోగి/కార్మికుడు పదేళ్ల కంటే ఎక్కువ కాలం సర్వీస్ లో ఉంటే వారు EPF మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
పీఎఫ్ డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవాలి?
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా PF విత్ డ్రా చేసుకోవచ్చు.EPFO అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి UAN, పాస్ వర్డ్ ఇవ్వడం ద్వారా లాటిన్ అయ్యి క్లెయిమ్ చేసుకోవచ్చు.
►ALSO READ | Time bond: సంతోషం అంటే ఏమిటి.. ఎలా పొందాలి...