వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( అక్టోబర్26 నుంచి నవంబర్ 1 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం...
మేషరాశి: ఈ వారం ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మీ ఆశయాలు నెరవేరేందుకు స్నేహితులు సహకరిస్తారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఇల్లు లేదా వాహనాలు కొంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. స్నేహితుల వల్ల ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృషభరాశి : ఈ రాశి వారికి వారమంతా ఆదాయం ఏదో ఒక రూపంలో వృద్ధి చెందుతూనే ఉంటుంది. ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ముందుకు దూసుకుపోతాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బును, బాకీలను వసూలు చేసుకోవడం వల్ల ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి.ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈ వారమంతా మిశ్రమ ఫలితాలుంటాయి.ఆదాయానికి మించిన ఖర్చులు. కార్యక్రమాలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. . వృత్తి, వ్యాపారాల్లోనే కాక, వ్యక్తిగత జీవితంలో కూడా ఏమాత్రం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ వారం తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమమవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. భూ లావాదేవీల వ్యవహారంలో సానుకూల ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు ఆశించన జాబ్ లభిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు కూడా పరవాలేదనిపిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
కన్యారాశి: ఈ వారం ఈ రాశి వారికి గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఇప్పటి వరకు వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ... పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తులారాశి: ఈ రాశి వారికి ఈవారంలో ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ఉద్యోగ, వ్యాపారంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలసిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం.. గృహనిర్మాణం చేపట్టే అవకాకాశాలున్నాయి.
వృశ్చికరాశి:ఈ రాశి వారు ధనస్సు రాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలను .. ఆలోచనలను అందరూ అంగీకరిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి.. వారం చివరిలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వారి బిజినెస్ ఉత్సాహంగా సాగుతుతుంది. నిరుద్యోగులు కాల్ లెటర్స్ అందుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ధనుస్సురాశి: ఈ వారం ఈ రాశి వారికి అత్యంత ప్రముఖులతో కూడా పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన లాభానికి అవకాశముంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ వల్ల అధికారులు అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు ఉద్యోగం మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరి ష్కరించుకుంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ వారం అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. కొత్త పెట్టుబడుల విషయంలోఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు. విద్యార్థుల విషయంలో కేరీర్ పరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో మిశ్రమఫలితాలుంటాయి. వారం మధ్యలో నుంచి కొంత ఊరట లభిస్తుంది. స్థిర ఆస్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో కుటుంబ మిశ్రమ వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు ఖర్చులు పెరుగుతాయి. ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి.. ప్రేమ వ్యవహారాలు పరవా లేదనిపిస్తాయి.
మీనరాశి: ఈ రాశి వారు ఈ వారం బిజీబిజీగా గడుపుతారు. వ్యాపారాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
