ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేరు పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రరిస్టుల వాచ్‌లిస్టులో చేర్చింది. రియాద్ లో జరిగిన ఓ ప్రోగ్రాంలో మాట్లాడిన సల్మాన్ ఖాన్.. బలూచిస్తాన్ పేరును ప్రస్తావించడం నచ్చని పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు తీవ్రంగా మండిపింది. బలూచిస్తాన్ ను ఓ ప్రత్యేక దేశంగా సూచిస్తూ సల్మాన్ ఖాన్ మాట్లాడారని..బలూచిస్తాన్ఉగ్రవాదుల లిస్టులో సల్మాన్ ఖాన్ పేరును కూడా చేర్చినట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆదివారం( అక్టోబర్26) రియాద్ఫోరంలో జరిగిన ఓ కార్యక్రమంలో బలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. సల్మాన్ వ్యాఖ్యలు అక్కడ పెద్ద దుమారం రేపాయి. సల్మాన్ ఖాన్ తమ దేశ భద్రతకు ముప్పు కలిగించేవ్యక్తి అని పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం (1997) కింద టెర్రరిస్టుల లిస్టులో అతని పేరును చేర్చినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది.
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. చాలా త్వరగా అందరి దృష్టిని ఆకర్షించింది. కొంతమంది ప్రేక్షకులు అతని మాటలను వ్యతిరేకించడగా, సమర్ధించారు.
ఇక ఈవిషయంపై బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీవ్రంగా విమర్శించింది. నటుడైన సల్మాన్ ఖాన్ పై ఇంతటి కఠిన చర్యలు ఎందుకని ప్రశ్ని స్తున్నారు ఫిల్మ్ ఇం డస్ట్రీ ప్రముఖులు. సోషల్ మీడియాలో #StandWithSalmanKhan అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
పాకిస్తాన్ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం భారత్,పాకిస్తాన్ సంబంధాలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
