
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగం ఏర్పాటు చేసిన సమ్మర్క్యాంపుల్లో దందా జరుగుతోందని సోమవారం వెలుగులో ‘ఆటల పేరిట లూటీ’ హెడ్డింగ్‌తో పబ్లిష్ అయిన స్టోరీకి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించారు. తక్షణమే వివరణ ఇవ్వాలంటూ ఖైరతాబాద్ గేమ్స్ ఇన్ స్పెక్టర్ మాధవి, ఖైరతాబాద్ జోన్ స్పోర్ట్స్ విభాగం అడిషనల్ డైరెక్టర్ రహీనా బేగం, సికింద్రాబాద్ జోన్ గేమ్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ కు అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు మెమోలు జారీ చేశారు.
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఖైరతాబాద్ జోన్ కి సంబంధించి ఏ స్పోర్ట్స్కాంప్లెక్స్లోనూ ఇబ్బందులు లేవని, డబ్బులు ఎక్కువగా తీసుకోవడం లేదని వారు వివరణ ఇచ్చారు. అమీర్ పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో స్విమ్మింగ్ పూల్ కి సంబంధించి బోర్ అందుబాటులో లేదని, వాటర్ ట్యాంకర్లు సరఫరా చేయాలని వాటర్ బోర్డుని కోరామని, అందుకే ఓపెన్ చేయలేదని వివరణ ఇచ్చారు.