
హైదరాబాద్ సిటీ, వెలుగు: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి అందగత్తెలు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.
సోమవారం మిస్ పోర్చుగల్ మరియా అమేలియా బాప్టిస్టా, మిస్ ఘనా జుట్టా అమా, మిస్ నమీబియా సెల్ మా కార్లీషియా, మిస్ ఐర్లాండ్ జాస్మిన్ హైదరాబాద్కు వచ్చారు.