
కొత్తసెక్రటేరియట్ నిర్మాణ పనులను ఈ నెలలోనే మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. వెంటనే టెండర్లు పిలిచి, శరవేగంగా ప్రాసెస్ కంప్లీట్ చేయాలని సూచించినట్టు సమాచారం. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు రివ్యూ కొనసాగింది. ఇందులో సెక్రటేరియట్ కొత్త డిజైన్లపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎక్కడ ఏ నిర్మాణం ఉండాలి, బయటికి కనిపించే డిజైన్లుఎలా ఉండాలి.. పార్కులు, పార్కింగ్ ప్లేస్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కొత్త సెక్రటేరియట్ డిజైన్, నిర్మాణాలకు సంబంధించి కేసీఆర్ పలు మార్పులు చేసినట్టు తెలిసింది. మట్టి దిబ్బలను వెంటనే తొలగించాలని.. మిగిలిన బ్లాకుల కూల్చివేతలను 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇందుకు మిషనరీ తెప్పించినట్టు అధికారులు వివరించారు.