వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( నవంబర్ 2 నుంచి 8 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం...
మేషరాశి: ఈ రాశి వారికి ఈవారం పాత బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆఫీసులో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగిపోతాయి
వ్యాపారస్తులకు పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. . ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో వ్యవహరించాలని పండితులు సూచిస్తున్నారు.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈ వారం కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కాల్ లెటర్స్ వస్తాయి.ఈ వారంలో మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం పెరుగుతుంది. మంచి అవకాశాలతో గౌరవ మర్యాదలను పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు
మిథునరాశి : ఈ రాశి వారు ఈ వారం ఉల్లాసంగా ... ఉత్సాహంగా కొనసాగిస్తారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కర్కాటకరాశి :ఈ వారం ఆర్ధికంగా అభివృద్ది చెందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మంచి ఆఫర్లు అందుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంశలు లభిస్తాయి. ఉద్యోగాల్లో మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం.నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పూర్వం చేసుకున్న ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా బాగుంటుంది. బిజినెస్ చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్తగా పెట్టబడులు పెట్టేందుకు అనుకూల సమయమని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు గుడ్ న్యూస్ వింటారు.గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో ఆర్థికంగా బలపడతారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కన్యారాశి: ఈరాశి వారికి ఈ వారంకొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. వారం ప్రారంభంలో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి విషయాల్లో అవసరానికి మించి మాట్లాడవద్దు. ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుత్సాహం పడకుండా మీ పని మీరు చేసుకోండి.
తులారాశి: ఈ రాశి వారు ఈ వారం చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి. కొత్త పనులను ప్రారంభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. కార్యాలయంలో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చర్మ సంబంధ ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోండి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా అభివృద్ది ఉంటుంది. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు.ఉద్యోగస్తులు మంచి ఆఫర్లు అందుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంశలు లభిస్తాయి. ఉద్యోగాల్లో మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు.
ధనుస్సురాశి: ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త వస్తువుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. అనుకోకుండా లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మకరరాశి: ఈ రాశివారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలకపాత్రపోషించే అవకాశం ఉంది. వృత్తి పనివారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు కనిపిస్తాయి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులను పూర్తిచేయడంపై శ్రద్ధ చూపుతారు.రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆస్తి వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సా హం లభిస్తాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. మొండి బకాయిలు, బాకీలు వసూలవుతాయి.
మీనరాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరు చేపట్టిన పనుల్లో మొదట్లో ఆటంకం కలిగినా... చివరికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది.. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు వారాంతంలో అంతా మంచే జరుగుతుంది. గతంలో ఎదుర్కొన్న నష్టాల నుంచి బయటపడతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
