భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK) జూనియర్ టెక్నీషియన్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్డ్పైన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 21.
పోస్టుల సంఖ్య: 34.
పోస్టులు: జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఎలక్ట్రిక్) 05, జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్) 03, జూనియర్ టెక్నీషియన్ (మిల్‌వ్రైట్) 05, డిప్లొమా టెక్నీషియన్ (సీఎన్సీ ఆపరేటర్) 10, జూనియర్ టెక్నీషియన్ (మిల్లర్) 01, జూనియర్ టెక్నీషియన్ (ఎగ్జామినర్ ఇంజినీరింగ్) 09, జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్) 01.
ఎలిజిబిలిటీ
జూనియర్ టెక్నీషియన్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, కేబుల్ జాయింటర్, విండర్ (ఆర్మేచర్), మెకానిక్ (హెచ్‌టీ, ఎల్టీ ఎక్విప్ మెంట్స్, కేబుల్ జాయింటింగ్), ఎలక్ట్రికల్ మెకానిక్, మెకానిక్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ (ఇండస్ట్రియల్ అటోమేషన్), మెకానిక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఉపయోగించే పరికరాల మరమ్మతు, నిర్వహణ), ఫిట్టర్ జనరల్, మెకానిక్ మెషిన్‌టూల్స్ మెయింటెనెన్స్, టూర్ అండ్ డై మేకర్, మిల్‌వ్రైట్ మెకానిక్, మెకానికల్ అడ్వాన్స్ మెకానిక్ టూల్ మెయింటెనెన్స్, మెకానిక్ మెకట్రానిక్స్‌లో నేషనల్ అప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
డిప్లొమా టెక్నీషియన్: మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, టూల్ అండ్ డై మెకింగ్లో డిప్లొమాతోపాటు నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్ లైన్ ద్వారా. ది డిప్యూటీ జనరల్ మేనేజర్/ హెచ్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ– 502205 చిరునామాకు అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: నవంబర్ 01.
లాస్ట్ డేట్: నవంబర్ 21.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ddpdoo.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
