రూ. 5,817 కోట్ల విలువైన..చెలామణిలో రూ.2 వేల నోట్లు..

రూ. 5,817 కోట్ల విలువైన..చెలామణిలో  రూ.2 వేల నోట్లు..
  • ప్రకటించిన ఆర్​బీఐ

న్యూఢిల్లీ: రూ. రెండు వేల విలువైన నోట్లలో ఇంకా రూ. 5,817 కోట్లు చెలామణిలో ఉన్నట్లు  ఆర్​బీఐ  తెలియజేసింది. 2023 మే 19న రూ. రెండు వేల నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పుడు వాడకంలో ఉన్న నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2025 అక్టోబర్ 31 నాటికి ఇది రూ. 5,817 కోట్లకు తగ్గింది.  

మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. రెండు వేల నోట్లలో 98.37 శాతం తిరిగి వచ్చాయి. రూ. రెండు వేల నోట్లను మార్చుకునే సౌకర్యం 19 ఆర్​బీఐ ఆఫీసుల్లో అందుబాటులో ఉంది. ఇండియా పోస్ట్ ద్వారా కూడా ఈ నోట్లను ఆర్​బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపవచ్చు.