వేయి స్తంభాల గుడి పనులు.. ఈ ఏడాదిలోనే పూర్తి: మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

వేయి స్తంభాల గుడి పనులు.. ఈ ఏడాదిలోనే పూర్తి:  మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

శిల్పి వ్యతిగత కారణాల వల్లే పనులు ఆలస్యం
కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌తో కలిసి 
వ్యాగన్‌‌‌‌‌‌‌‌ తయారీ యూనిట్‌‌‌‌‌‌‌‌కు స్థల పరిశీలన

హనుమకొండ/వరంగల్, వెలుగు :  ఈ ఏడాదిలోనే వేయి స్తంభాల గుడి పునరుద్ధరణ పనులు పూర్తి చేసి, భక్తులు, టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. నిర్మాణ పనులు చేపట్టే శిల్పి వ్యక్తిగత కారణాల వల్ల పనులు ఆలస్యం అయ్యాయని చెప్పారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్‌‌‌‌‌‌‌‌కు రానుండడంతో కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదివారం హనుమకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొనడంతో పాటు ప్రధాని మోడీ సభా స్థలాన్ని పరిశీలించారు. 

ముందుగా కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే వ్యాగన్‌‌‌‌‌‌‌‌ మ్యానుఫాక్చరింగ్, పీరియాడికల్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ హాలింగ్ కంపెనీలు నిర్మించనున్న స్థలాన్ని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌, పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో కలిసి పరిశీలించారు. ఆయా ఫ్యాక్టరీల గురించి డీఆర్ఎం ఏకే గుప్తా, ఏడీఆర్‌‌‌‌‌‌‌‌ఎం ప్రదీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌ కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సిక్తా పట్నాయక్, గ్రేటర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్​ షేక్‌‌‌‌‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ బాషా, ఇతర ఆఫీసర్లతో మాట్లాడి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

వేయి స్తంభాల గుడిని దర్శించుకున్న కేంద్రమంత్రి

వరంగల్‌‌‌‌‌‌‌‌లోని వేయి స్తంభాల గుడిని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు, ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేయి స్తంభాల గుడిని పునర్‌‌‌‌‌‌‌‌నిర్మించే శిల్పులు, సహాయకులు తెలంగాణలో లేకపోవడంతో తమిళనాడుకు చెందిన శిల్పి, ఇతర సహాయకులతో పనులు చేయిస్తున్నట్లు చెప్పారు. శిల్పి వ్యక్తిగత కారణాల వల్ల పనులు ఆలస్యం అయ్యాయని, ఈ ఏడాదిలోనే మండప నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. పండుగల టైంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా మండపాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు.

సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

హనుమకొండ ఆర్ట్స్​కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 8న నిర్వహించనున్న బీజేపీ ‘విజయ సంకల్ప సభ’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. అయోధ్యపురం నుంచి నేరుగా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ఆయన బండి సంజయ్‌‌‌‌‌‌‌‌తో కలిసి భద్రతా ఏర్పాట్లపై వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్‌‌‌‌‌‌‌‌తో చర్చించారు. ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీపీకి సూచించారు. అనంతరం ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌ కాలేజీ ఆఫీసర్లతో మాట్లాడారు. తర్వాత హరితహోటల్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడి, హనుమకొండ ఎస్‌‌‌‌‌‌‌‌వీ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌లో కార్యకర్తలతో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్చి మురళీధర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఏనుగుల రాకేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌‌‌‌‌రావు, కుసుమ సతీశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 
భద్రకాళి ఆలయంలో బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ పూజలుబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ ఆదివారం సాయంత్రం భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.