డిగ్రీ, బీటెక్ అర్హతతో సి–డాక్​లో  కన్సల్టెంట్ ఉద్యోగాలు.. 

డిగ్రీ, బీటెక్ అర్హతతో సి–డాక్​లో  కన్సల్టెంట్ ఉద్యోగాలు.. 

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి పుణలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్​ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(సీ–డాక్)నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను పార్ట్ టైం/ ఫుల్ టైం బేస్డ్ నియామకాలు జరుపుతారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సి–డిఎసి అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు జూన్ 6 ఆఖరు. 

పోస్టులు 13: సీనియర్ కన్సల్టెంట్(బయో ఇన్ఫర్మేటిక్) 01, కన్సల్టెంట్(టెక్నికల్ హెల్ప్ డెస్క్ ) 02, కన్సల్టెంట్ (సర్వర్/ స్టోరేజ్ సిస్టమ్ అడ్మిన్ ఎల్–2/ ఎల్3)02, కన్సల్టెంట్(క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) 01, మెకానికల్ డిజైన్ 01, కన్సల్టెంట్ (డొమైన్ ఎక్స్ పర్ట్ ఇన్ ఫీఎఫ్)01, కన్సల్టెంట్(డొమైన్ ఎక్స్ పర్ట్ ఇన్ ఈ గవర్నమెంట్) 01, కన్సల్టెంట్(డేటా బేస్ డెవలపర్) 01, కన్సల్టెంట్ (డేటాబేస్ డెవలపర్) 01, అడ్వైజర్(హెచ్ పీసీ) 01. 

  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ లేదా బీటెక్, పీజీ, ఎంఈ లేదా ఎంటెక్, పీహెచ్​డీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • లాస్ట్ డేట్: జూన్ 6. 
  • సెలెక్షన్ ప్రాసెస్: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.