ముషీరాబాద్,వెలుగు: పోషణ లోపం ఏ ఒక్కరిలోనూ కనిపించొద్దని చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సునంద పేర్కొన్నారు. పోషక పక్షంలో భాగంగా పోషక విలువలపై బుధవారం రాంనగర్ అడిక్ మెట్ లోని అంగన్ వాడీ సెంటర్ లో బాలింతలు, టీచర్లకు సూపర్ వైజర్ కవిత అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. అన్నం పప్పుకు పరిమితం కాకుండా చిరుధాన్యాలను వినియోగించాలని సూచించారు. చిన్నపిల్లలు తల్లు లు ఎక్కువగా చిరుధాన్యాలను తీసుకోవాలని సూచించారు. సీతాఫల్ మండీ సూపర్ వైజర్ జాహ్నవి, సంధ్య, అనూష, రాధ ఉన్నారు.
