ఓలా డ్రైవర్‌కు కన్జూమర్ కోర్టు షాక్: మహిళను రాంగ్ ప్లేస్‌లో దించినందుకు రూ.50 వేల జరిమానా

ఓలా డ్రైవర్‌కు కన్జూమర్ కోర్టు షాక్: మహిళను రాంగ్ ప్లేస్‌లో దించినందుకు రూ.50 వేల జరిమానా

ఓ మహిళను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లి పోయిన ఓలా డ్రైవర్ కు షాకిచ్చింది కన్జూమర్ కోర్టు. ఓలా యాప్ లో ఆటో బుక్ చేసుకుంటే దించాల్సిన చోట దించకుండా 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అదనంగా డబ్బులు డిమాండ్ చేశాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ మహిళ కీలకమైన జూనియర్ సివిల్ జడ్జి మెయిన్స్ రాసేందుకు వెళ్తూ తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కన్జూమర్ కోర్టు  ఓలా డ్రైవర్ కు 50వేల రూపాయల జరిమాని విధించినంది. డ్రైవర్లపై  గట్టి  నిఘా పెట్టాలని ఓలా యాజమాన్యానికి సూచించింది.  ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 

ఆంధ్రప్రదేశ్‌లో ఓలా సేవలపై వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. జూనియర్ సివిల్ జడ్జి మెయిన్స్ పరీక్షకు వెళ్తున్న మహిళా అభ్యర్థిని మార్గమధ్యంలో వదిలేసిన ఘటనలో ఓలాకు రూ.50 వేల నష్టపరిహారం విధించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఓలా ఆటో బుక్ చేసుకున్న అభ్యర్థి ఉల్లాజీ చెన్నమ్మకు డ్రైవర్ తీవ్ర ఇబ్బందులు గురి చేశాడు. యాప్‌లో చూపిన వాహనం కాకుండా వేరే వాహనంతో వచ్చిన డ్రైవర్, OTP తీసుకున్న తర్వాత సరైన మార్గంలో వెళ్లకుండా దారి మళ్లించి అదనపు డబ్బు డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో, ఆమెను ,ఆమె తల్లిని రోడ్డుమధ్యలో దింపేసి వెళ్లిపోయాడు.

ఈ ఘటనపై స్పందించిన కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్..  కేవలం ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం అని చెప్పుకుని బాధ్యత నుంచి తప్పించుకోలేరు అంటూ ఓలాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళా కీలకమైన పరీక్షకు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన మానసిక వేదన, భయం, అవమానానికి గురిచేసిందని అభిప్రాయపడింది.  అలాగే, డ్రైవర్లపై కఠిన పర్యవేక్షణ, భద్రతా చర్యలు తీసుకోవాలని ఓలాకు సూచించింది. ఈ తీర్పు యాప్ ఆధారిత క్యాబ్ సేవల బాధ్యతపై కీలక సందేశంగా మారింది.