ఆగస్టులో తగ్గిన .. పెట్రోల్​, డీజిల్​ డిమాండ్

ఆగస్టులో తగ్గిన .. పెట్రోల్​, డీజిల్​ డిమాండ్

న్యూఢిల్లీ: వర్షాల కారణంగా ఆగస్టు నెల మొదటి 15 రోజులలో పెట్రోల్, డీజిల్​ వినియోగం​ తగ్గినట్లు డేటా చెబుతోంది. కిందటి నెలతో, అంతకు ముందు ఏడాది ఆగస్టు నెల మొదటి 15 రోజులతో పోల్చినా వాటి వినియోగం తగ్గినట్లు పేర్కొంది. పెట్రోల్​, డీజిల్​ డిమాండ్​ తగ్గడం వరసగా ఇది రెండో నెల.  రుతుపవనాల టైములో వాటి డిమాండ్ తగ్గడం సాధారణమైనదే. ఆగస్టు 1–15 మధ్య కాలంలో డీజిల్​ డిమాండ్​ 5.7 శాతం తగ్గి 2.67 మిలియన్​ టన్నులకు చేరింది. జులై నెల మొదటి 15 రోజులలో  వినియోగం  15 శాతం పడిపోయినా, ఆ తర్వాత 15 రోజులలో కొంత పుంజుకుంది.

రుతుపవనాల వల్ల వ్యవసాయ రంగంలో డీజిల్​ వినియోగం తగ్గిపోతుంది. దాంతో డిమాండ్​ కూడా పడిపోతుంది. ఈ ఏడాది ఏప్రిల్​, మే నెలల్లో వ్యవసాయ రంగం​ కారణంగా డీజిల్ డిమాండ్​ వరసగా 6.70 శాతం, 9.3 శాతం ఎగసింది. ఏసీల వినియోగం కూడా వేసవిలో ఎక్కువైంది. అది కూడా డిమాండ్​ పెరగడానికి మరో కారణంగా నిలిచింది. 

మరోవైపు పెట్రోల్​ అమ్మకాలు సైతం ఆగస్టు మొదటి 15 రోజులలో 8 శాతం తగ్గి 1.19 మిలియన్​ టన్నులకు చేరాయి. జులై నెలలో పెట్రోల్​ వినియోగం 10.5 శాతం తగ్గింది. ​ ఎకానమీ నిలకడగా ఎదుగుల సాధిస్తున్న నేపథ్యంలో రాబోయే నెలల్లో  పెట్రోల్​, డీజిల్​ డిమాండ్​ ఊపందుకుంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.