మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధూలే జిల్లాలో రాత్రి ఆర్టీసీ బస్సు, కంటైనర్ డీ కొన్నాయి. నీమ్గల్ గ్రామ సమీంపలో షాహాడ – దొండైచ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 12 మంది  అక్కడికక్కడే  ప్రాణాలు కోల్పోగా,  మరో 20  మంది  తీవ్రంగా  గాయపడ్డారు.  ఘటనాస్థలికి  చేరుకున్న  పోలీసులు  సహాయక  చర్యలు చేపట్టారు.  గాయపడిన వారిని   చికిత్స  కోసం దగ్గరలోని  ఆస్పత్రికి  తరలించారు.  మృతుల్లో  రెండు  వాహనాల డ్రైవర్లు  ఉన్నారు.  మృతదేహాలను  పోస్టుమార్టం  కోసం  ధూలే  జిల్లా  ప్రభుత్వాసుపత్రికి  తరలించారు.