
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్టెక్నాలజీ, హైదరాబాద్(ఐఐటీ హైదరాబాద్) మల్టీమీడియా కంటెంట్ క్రియేటర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 31.
పోస్టులు: మల్టీ మీడియా కంటెంట్ క్రియేటర్
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మల్టీమీడియా ప్రొడక్షన్లో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జులై 31.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు iith.ac.in/careers వెబ్సైట్లో సంప్రదించగలరు.