వ్యాక్సిన్​పై జీఎస్​టీ కంటిన్యూ..

వ్యాక్సిన్​పై జీఎస్​టీ కంటిన్యూ..

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్స్​తోపాటు, మెడికల్​ సప్లయ్​లపై జీఎస్​టీ మినహాయింపుపై శుక్రవారం మీటింగ్​లో జీఎస్​టీ కౌన్సిల్​ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. జూన్​ 8 నాడు ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు మీటింగ్​ తర్వాత ఫైనాన్స్​ మినిస్టర్ నిర్మలా సీతారామన్​ మీడియాకు చెప్పారు. అయితే, బ్లాక్​ ఫంగస్​ ట్రీట్​మెంట్​కు వాడే మెడిసిన్స్​ దిగుమతులపై డ్యూటీ మినహాయింపును జీఎస్​టీ కౌన్సిల్​ ప్రకటించింది. వ్యాక్సిన్స్​, మెడికల్​ సప్లయ్​లపై ట్యాక్స్​ స్ట్రక్చర్​ను మంత్రుల గ్రూప్​ చర్చించనున్నట్లు ఫైనాన్స్​ మినిస్టర్​ చెప్పారు. బ్లాక్​ఫంగస్​ ట్రీట్​మెంట్​లో కీలకమైన యాంఫోటెరిసిన్​–బీ మెడిసిన్​పై ఐ–జీఎస్​టీ మినహాయిస్తున్నట్లు కౌన్సిల్​ వెల్లడించింది. జీఎస్​టీ అమలు వల్ల రాష్ట్రాలకు వచ్చిన లోటు పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వమే రూ. 1.58 లక్షల కోట్లను అప్పుగా తీసుకుని, ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని కూడా కౌన్సిల్​ మీటింగ్​లో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలకు ఇచ్చే కాంపెన్సేషన్​ గడువును మరో అయిదేళ్లు పొడగించేందుకు కౌన్సిల్​ ప్రత్యేక సెషన్​ త్వరలో నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ముందుగా అనుకున్న ప్రకారం 2022 దాకా మాత్రమే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కాంపెన్సేషన్​ ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాదిలో జరిగిన మొదటి జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్​ ఇదే. నిజానికి ప్రతి మూడు నెలలకూ ఒకసారి జీఎస్​టీ కౌన్సిల్ మీటింగ్​ జరగాల్సి ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా, కిందటేడాది అక్టోబర్​ తర్వాత జరగలేదు.