చాదర్ ఘాట్ వద్ద కొనసాగుతున్న మూసీ ప్రవాహం

చాదర్ ఘాట్ వద్ద కొనసాగుతున్న మూసీ ప్రవాహం

హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో జనజీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరి ప్రజలు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రోడ్డు పైకి వరద నీరు చేరి... రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చాదర్ ఘాట్, మూసారాంబాగ్, మలక్ పేట్ లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. మూసీ ప్రవాహం ఇంకా కొనసాగడంతో అధికారులు అక్కడ రాకపోకలు నిలిపివేశారు. 

గండిపేట్ కి సంబంధించి 13 గేట్లు ఓపెన్ చేసి దిగువకు 8281 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. హిమాయత్ సాగర్ కి సంబంధించి ఎనిమిది గేట్లు ఓపెన్ చేసి 10,700 క్యూసెక్కులు వదిలారు. దీంతో మలక పేట్ లోని అనేక బస్తీల్లో నివసించే ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించార. ఇప్పటివరకు రెండు వేల మందిని తరలించినట్టు సమాచారం. రాత్రి నుంచి మూసీ నదిలో భారీగా నీరు ప్రవహించడంతో పక్కనే ఉన్న చాదర్‌ఘాట్, శంకర్ నగర్, కమల్ నగర్, మూసా నగర్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ఇళ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి.