విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవు

విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రభుత్వాలు గుడ్ న్యూస్. విద్యాశాఖ మూడు రోజులు సెలవులను మంజూరు చేస్తూ ప్రకటన జారీ చేసింది.  వచ్చే నెల మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం. హిందువులు జరుపుకునే పెద్ద పండగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఈ రోజు శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. కావున ప్రభుత్వం ఆ రోజును సెలవు దినంగా  ప్రకటించింది. 

తర్వాతి రోజు మార్చి 9 రెండవ శనివారం, మార్చి 10 ఆదివారం కావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. మూడు రోజులు హాలిడేస్  రావడంతో చాలా మంది విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోట్టేత్తనున్నారు. శివరాత్రి సందర్భంగా జాగారం ఉన్న వారికి ఈ మూడు రోజుల సెలవులు బాగా కలిసిరానున్నాయి.